Ram Gopal Varma Anonounced about next film "Andham"

 
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సినిమా ఎనౌన్స్ చేశారు. పేరు 'అందం'. బ్రెజిల్ బ్యూటీ నథాలియా ఇందులో కథానాయిక. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ ' నేను స్త్రీ అందానికి భక్తుడిననే మాట ఎప్పుడూ దాచలేదు. అయితే ఇంతవరకూ నథాలియా వంటి అందగత్తెను నేను చూడలేదు. ఆమె నా 'డిపార్ట్‌మెంట్' చిత్రంలో 'డాన్ డాన్' అనే ఐటెం సాంగ్‌ను చేయడం నా అదృష్టం. ఈ పాటను చిత్రీకరిస్తుండగా ఆమెని చూసి నేను ఎంత ప్రభావితం అయ్యానంటే ఎప్పటికైనా ఆమెతో 'అందం' అనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. 'రక్తచరిత్ర' చిత్రం హింసకు పరాకాష్ట అయితే, 'అందం' సినిమాలో నథాలియా అందం అందానికి పరాకాష్ట అవుతుంది' అన్నారు.
Tags: , , , ,

CCL Calendar 2012 HOT Images